హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) డిమాండ్ చేసింది. అసోసియేషన్ క్యాలెండర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహా శుక్రవారం ఆవిష్కరించారు. పలు డిమాండ్లను మంత్రి ముందుంచారు. నోషనల్ సర్వీస్ పదోన్నతులు, నూతన నియామకాలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, సహా అధ్యక్షులు ధనుంజయ్, రవీందర్‌గౌడ్, ఆంజనేయులు, శ్రీనివాస్, కార్తీక్, చిరంజీవి, రమేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులకు తపస్ మద్దతు
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) మద్దతు తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సీ అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పులి సరోత్తంరెడ్డి, మల్క కొమురయ్యకు తపస్ కార్యవర్గం మద్దతు ప్రకటించింది. సమావేశంలో ఏబీఆర్ఎస్ఎం ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంతా లక్ష్మణ్, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకట్రావు, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ పాల్గొన్నారు.