నదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు గుర్తింపు
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం పెనుగొల్లు సమీపంలోని వరాహ నదిలో స్నానం చేసేందుకు ఆరుగురు యువకులు దిగారు.
- విషాదంలో అనకాపల్లి
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం పెనుగొల్లు సమీపంలోని వరాహ నదిలో స్నానం చేసేందుకు ఆరుగురు యువకులు దిగారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో వీరిలో కాతేటి రిషి(18), ముప్పిడి నాగవంశీ(22), కోడి జగదీశ్(20) నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మిగతా ముగ్గురు ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో శనివారం సాయంత్రం నుంచి నదిలో ముమ్మరంగా గాలింపు చేపట్టగా ఆదివారం ఉదయం ముగ్గురు యువకుల మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు, స్థానికులు కలిసి మృతదేహాలను బయటకు తీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

