కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో మంగళవారం ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రాచర్లకు చెందిన మౌనిక ప్రసవం కోసం ఎంసీహెచ్‌లో చేరారు. వైద్యులు మంగళవారం శస్త్రచికిత్స చేసి ప్రసవం చేయగా, ముగ్గురు మగ శిశువులు జన్మించారని ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి తెలిపారు. తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
-విద్యానగర్(కరీంనగర్)