కమలాపూర్, ఏప్రిల్ 12: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిందితులైన ఏ6 పోగు సుభాష్, ఏ8 దూలం శ్రీకాంత్, ఏ9 పెరుమాండ్ల శ్రామిక్ను బుధవారం అరెస్ట్ చేసినట్టు సీఐ సంజీవ్ తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను అంబాల గ్రామంలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్టు వెల్లడించారు. హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఏ1 బండి సంజయ్, ఏ2 బూరం ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్ ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఏ6 పోగు సుభాష్, ఏ8 దూలం శ్రీకాంత్, ఏ9 పెరుమాండ్ల శ్రామిక్ నిందితులుగా ఉండడంతో అరెస్ట్ చేసినట్టు సీఐ వెల్లడించారు.