సుబేదారి,డిసెంబర్08 : ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు గంజాయి నిందితులను నార్కోటిక్స్ పోలీసులు పట్టుకొని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. హనుమకొండ పోలీసు స్టేషన్ కంప్యూటర్ రూమ్ నుంచి సోమవారం తెల్లవారుజామున 5గంటలకు సెంట్రీ డ్యూటీ పోలీసుల కళ్లు గప్పి కంప్యూటర్ రూమ్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ముగ్గురు దొంగలు పరార్ అయ్యారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో పారిపోయిన దొంగలను పట్టుకివడానికి హనుమకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంటీవలనే మామూనూరు పీఎస్ నుంచి ఇద్దరు గంజాయి దొంగలు పరార్ అయిన విషయం తెలిసిందే. ఈ స్టేషన్లో విధుల నిర్లక్ష్యంతో ఇద్దరు సిబ్బంది పై సస్పెన్షన్ వేటుపడింది. ఇది జరిగి నెల రోజులు కాకముందే మళ్లీ హనుమకొండ పీఎస్ నుంచి మరో ముగ్గురు గంజాయి నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకుపోవడం స్టేషన్ అధికారుల పర్యవేక్షణకు పరాకాష్టగా మారింది.