Urea Shortage | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మంత్రి ఇలాకాలో యూరియా కొరత ఉందని వార్తలు రాస్తున్నందుకు ‘నమస్తే తె లంగాణ’ రిపోర్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కొన్ని రోజులుగా రైతులు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మండలం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గపరిధిలోకి వ స్తుంది. ఇటీవల ఆత్మకూరు పీఏసీసీఎస్ ముందు చెప్పుల వరుసలో రైతు అలసి సొల సి పడుకున్న ఫొటో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించడంతో ఇది వైరల్‌గా మారింది.
ఆ మరుసటి రోజు రైతు లు యూరియా దొరకక ఆగ్రహం చెంది రాళ్ల తో దాడి చేశారు. ఈ రెండు ఘటనలు సీఎం సొంత జిల్లా కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. మంగళవారం నాడు మళ్లీ యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచడంతో విషయం తెలుసుకున్న ఆత్మకూరు అమరచింత విలేకరి సురేందర్ బాబు అక్కడికి వెళ్లారు. యూరియా సరఫరా పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఓ ఎస్సై అక్కడికి చేరుకొని నీ వల్లనే న్యూసెన్స్ జరుగుతుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇ చ్చారు.
ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు ముందే చెబుతున్నా అంటూ బెదిరించా రు. అంతటితో ఆగకుండా మళ్లీ అతన్ని పోలీ స్ స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్లో ఓ పోలీసు ఉన్నతాధికారి మీపై పీఏసీసీఎస్ నుంచి ఫిర్యా దు వచ్చింది జాగ్రత్త అంటూ మందలించి పంపారు. ఈ రెండు ఘటనలతో ‘నమస్తే తెలంగాణ’ విలేకరి భయభ్రాంతులకు గురయ్యాడు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు సంప్రదించగా అలాంటిదేమీ లేదు అని కొట్టిపారేశారు. పత్రిక స్వేచ్ఛను కాలరాసే విధంగా విలేకరులను బెదిరించడం సమంజసం కాదని జర్నలిస్టు సంఘా లు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.