ఈసారీ ఇంటర్లో 70% సిలబసే!

- ఇంటర్‌బోర్డుకు లేఖ పంపించిన సీబీఎస్ఈ
- సర్కారుకు ఇంటర్ అధికారుల ప్రతిపాదనలు
- త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): 2021-22 విద్యాసంవత్సరానికి కూడా ఇంటర్మీడియట్లో 70 శాతం సిలబస్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖరారుచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డుకు లేఖను పంపించింది. 70 శాతం సిలబస్ అమలుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇంటర్‌బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. గతేడాది 30 శాతం తగ్గించి, 70 శాతం సిలబస్‌ను ఖరారుచేశారు. ఈ విద్యాసంవత్సరం కూడా అదే అమలుచేయనున్నారు. గతేడాది సిలబస్‌ను ఇంటర్‌బోర్డు వెబ్సైట్లో పొందుపరచగా.. ఆ సిలబస్‌కే 2022 మార్చి/ ఏప్రిల్ నెలల్లో ఫస్టియర్, సెంకడియర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.
విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా..
కరోనా ఈ విద్యాసంవత్సరంపైనా తీవ్ర ప్రభావం చూపింది. జూన్ 1న ప్రారంభంకావాల్సిన ఇంటర్ కాలేజీలు సెప్టెంబర్ ఒకటి నుంచి తెరుచుకున్నాయి. 280 రోజులపాటు కాలేజీలు నడవాల్సి ఉండగా.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ కలుపుకొంటే 220 రోజులు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ విద్యాసంవత్సరం సైతం 70 శాతం సిలబస్‌నే కొనసాగించడం ఉత్తమమన్న వాదనలువచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CBSE
- Intermediate Board
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

