Telangana | 200 మందికి ఇద్దరే టీచర్లు!.. ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
ఇద్దరు ఉపాధ్యాయులు 200 మందికి ఎలా బోధిస్తారంటూ ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో చోటుచేసుకున్నది.
Telangana | అశ్వారావుపేట రూరల్, జూలై 10 : ఇద్దరు ఉపాధ్యాయులు 200 మందికి ఎలా బోధిస్తారంటూ ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో చోటుచేసుకున్నది. హైస్కూల్కు తాళం వేసి వేలేరుపాడు-అశ్వారావుపేట ప్రధాన రహదారిపై మూడు గంటలపాటు బైఠాయించారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదని, ఇక తమ చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు గతంలో ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో భవనాలు నిర్మించినా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన ఎలా సాగుతుందని ప్రశ్నించారు. డీఈవో వెంకటేశ్వరాచారి ఫోన్లో గ్రామస్థులతో మాట్లాడారు. మూడు రోజుల్లో ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నలుగురు టీచర్లు.. ఐదుగురే విద్యార్థులు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 10 (నమస్తే తెలంగాణ)/మాడ్గుల: రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంటే, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మం డలం దొర్లపహాడ్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం విచిత్రకర పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు ఉండగా, ఐదుగురే విద్యార్థులు ఉన్నారు. మూడో తరగతిలో ఒకరు, రెండు, నాల్గో తరగతుల్లో ఇద్దరు చొప్పున మొత్తం ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. నిన్నటిదాకా ఈ పాఠశాలకు ఐదు పోస్టులు ఉండేవి. విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ అధికారులు ఒక పోస్టును రద్దు చేశారు. ప్రస్తుతం ఉన్న నలుగురు ఉపాధ్యాయుల్లో ఇద్దరు బదిలీపై రాగా.. వీరు బుధవారం పాఠశాలలో రిపోర్టు చేశారు.
ఒకవైపు విద్యార్థులు లేరనే వాస్తవం మధ్యాహ్న భోజనం పథకం రికార్డుల్లో కనిపిస్తున్నా అధికారులు ఆ ఖాళీలను ఆన్లైన్లో బ్లాక్ చేయకుండా బదిలీపై ఇక్కడికి ఉపాధ్యాయులను పంపడాన్ని గ్రామస్థులే తప్పుపడుతున్నారు. గతంలో 300 మంది వరకు విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు నలుగురికే పరిమితమవుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని పూర్వ విద్యార్థిని శిరీష ఆవేదన వ్యక్తంచేశారు. తాము ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం సాధించి గ్రామాల్లోని పిల్లలకు చదువు చెప్పేందుకు వస్తే ఇక్కడ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లల్ని పంపడం చాలా బాధాకరమని హెచ్ఎం సుజాత పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

