ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
తెలంగాణలో ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు నిలిచినట్టు తెలిపారు.
- లోక్‌సభ బరిలో 525 మంది అభ్యర్థులు..
- పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు 2.45 లక్షలు
- హోం ఓటింగ్ కోసం 24,974 మంది..
- మొత్తం ఓటర్లు 3.32 కోట్లు
- సీఈవో వికాస్‌రాజ్ వెల్లడి
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు నిలిచినట్టు తెలిపారు. గుర్తింపు పొందిన ప్రధాన మూడు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసినట్టు పేర్కొన్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ నుంచి అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నట్టు వెల్లడించారు. ఎన్నికల బరిలో 285 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నట్టు వివరించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక బరిలో 17 మంది నిలిచినట్టు సీఈవో వెల్లడించారు.
కొత్త ఓటర్లు 9.20 లక్షల మంది
రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో కొత్త ఓటర్లు 9.20 లక్షల మంది అని ఈసీవో వివరించారు. 2.45 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. హోం ఓటింగ్ కోసం 24,974 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో 15,970 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, వాళ్ల కోసం ఎలక్ట్రానిక్ మిషన్లు అందుబాటులో పెట్టామని చెప్పారు.
ఎన్నికల కోసం దాదాపు 2.95 లక్షల మంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. 60 వేల పోలీస్ సిబ్బందితోపాటు 20 వేల మంది అదనపు బలగాలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో సందేహాలు నివృత్తికి, ఫిర్యాదుల కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్, వెబ్బేస్, సీ విజిల్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రూ.81 కోట్ల నగదు, రూ.46 కోట్ల వి లువైన మద్యం, రూ.26 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసి 7,185 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పోలింగ్ శాతం పెంచేందు కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

