రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కార బాధ్యత.. కేంద్ర హోం శాఖదే : వినోద్ కుమార్
హైదరాబాద్ : విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో కేంద్ర హోంశాఖ మాత్రమే జోక్యం చేసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. అంతే తప్ప కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే కేంద్ర హోంశాఖ చొరవ తీసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు చూపాల్సిన బాధ్యత ఉంటుందని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయల అంశంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సహేతుకం కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల విషయంలో రెండు వైపులా వాదనలు విన్న తర్వాతే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సింది పోయి.. కేవలం ఆంధ్రప్రదేశ్ వాదనలను మాత్రమే సమర్థించి నెలరోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
ఇది ముమ్మాటికీ తప్పిదమే అవుతుందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల విషయంలో మాత్రం మౌనంగా ఉండడం తగదని వినోద్ కుమార్ అన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య క్లేమ్స్ అండ్ కౌంటర్ క్లేమ్స్ పట్టించుకోకపోవడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందనే విషయం స్పష్టమవుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ. 12,940 కోట్లు బకాయి పడి ఉందని అధికారులు లెక్కలు చెబుతుండగా, వాటిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పట్టించుకోకపోవడం , కేవలం ఆంధ్రప్రదేశ్ కు వాదనలను మాత్రమే వినడం సరైన పద్ధతి కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ జెన్ కో సంస్థ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉపసంహరించుకుందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఏపీ జెన్ కో విధానాన్ని నిరసిస్తూ టీ.ఎస్. జెన్ కో అండ్ టీ.ఎస్. డిస్కం సంస్థలు రాష్ట్ర హై కోర్టులో రిట్ పిటిషన్లు వేశాయని కూడా వినోద్ కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి రోజుల్లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయకుండా అడ్డుకున్నారని, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

