హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ): మేడిగడ్డ ప్రాజక్టు వద్ద మేటవేసిన ఇసుకను తొలగించేందుకు మంగళవారం తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు ఖరారు చేసింది. 92లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 14 బ్లాకులుగా విభజించి టెండర్లు ఆహ్వానించగా 400 ఏజెన్సీలు దాఖలు చేశాయి. వాటిలో లాటరీ పద్ధతిలో ఎంపికచేసి కాంట్రాక్టులు ఖరారు చేశారు. త్వరలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
బరాజ్‌ల వద్ద ఇసుక తవ్వకాల ద్వారా రూ. 1000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. రాష్ట్రం లో 100కు పైగా ఇసుక రీచ్‌లు ఉన్నప్పటికీ ఎన్జీటీ కేసులు, ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం 33 రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి సరఫరా చేస్తున్నారు. 60 లక్షల టన్నుల వరకు ఇసుక స్టాక్‌యార్డ్‌లో సిద్ధంగా ఉన్నందున వర్షాకాలంలో ఇసుక కొరత ఉండదని అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.