Salman Khan | సెక్రటరీగా పోటీ చేసినా ఓడిపోతా.. పొలిటికల్ ఎంట్రీపై సల్మాన్ ఖాన్ కామెంట్స్!
Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాను రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదనే విషయంపై తాజాగా స్పందించాడు.
Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాను రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదనే విషయంపై తాజాగా స్పందించాడు. ఇటీవల ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న సల్మాన్ను హోస్ట్ కపిల్ శర్మ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. సార్, దేశంలోని చాలా రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద స్టార్లను తమ పార్టీల్లోకి ఆహ్వానించి, వారి తరఫున ఎన్నికల్లో పోటీ చేయిస్తుంటాయి. దేశంలో మీకంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవారు ఎవరున్నారు? మరి మీకెప్పుడూ ఎన్నికల్లో నిలబడాలనిపించలేదా? అని ప్రశ్నించారు.
దీనికి సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో మాట్లాడుతూ.. నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నేనుండే బిల్డింగ్ వైపు చూస్తాను. మా బిల్డింగ్లో మొత్తం ఎనిమిది ఫ్లాట్లు ఉంటే.. అందులో మూడు ఫ్లాట్లు మావే. దేశ ప్రధాని, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సంగతి పక్కన పెడితే.. ఒకవేళ నేను మా బిల్డింగ్ సెక్రటరీ పదవికి పోటీ చేసినా ఘోరంగా ఓడిపోతాను. ఎందుకంటే నా సొంత ఇంట్లోని వాళ్లే నాకు ఆ మూడు ఓట్లు కూడా వేయరు అంటూ సల్మాన్ సరదాగా వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులే తనను గెలవనివ్వరంటూ ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ త్వరలోనే ‘మాతృభూమి’ (గతంలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’) అనే పవర్ఫుల్ వార్ డ్రామాలో కనిపించనున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిత్రంగద సింగ్ కథానాయికగా నటిస్తోంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో భారత జవాన్లు జరిపిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనితో పాటు ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఒక భారీ చిత్రంలో కూడా సల్మాన్ ఖాన్ నటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

