Rains | ఆపద రక్షకులెక్కడ?.. బాధితులను ఆదుకొనే దిక్కే లేదు
వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో భవనంపై కూడా తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించిన ఓ మహిళ తన నలుగురు పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు సహాయం కోసం హాహాకారాలు చేసింది.
Rains | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో భవనంపై కూడా తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించిన ఓ మహిళ తన నలుగురు పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు సహాయం కోసం హాహాకారాలు చేసింది. ఎంత మొత్తుకున్నా వారిని ఆదుకొనే నాథుడే కరువయ్యాడు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన ఇది. చివరికి ఆ మహిళ మధిరలోని తమ బంధువులకు కాల్ చేయగా.. అక్కడినుంచి వచ్చిన గజ ఈతగాళ్లు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మరో ఘటనలో మున్నేరు బ్రిడ్జిపై 9 మంది మధ్యాహ్నం ఎప్పడో చిక్కుకుంటే.. రాత్రి పది గంటల వరకూ వారిని కాపాడేవారే లేకపోయారు. ఆఖరికి ఓ జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి ఆ తొమ్మిదిమందిని కాపాడారు. మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కూడా వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వ్యవస్థ మొ ద్దు నిద్ర పోయినట్టు జరిగిన ఘటనలు తెలియజేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వం మారి న వెంటనే అధికార యంత్రాంగం ఎందుకు మొద్దునిద్రలోకి జారుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమ్మంలో ముగ్గురు మంత్రు లు, పోలీసు, అగ్నిమాపక వ్యవస్థ పూర్తిగా చేష్టలుడిగి బాధితులను ఆదుకోవడంలో చే తులెత్తేసింది. వరద ఉధృతికి ప్రజలు ప్రాణా లు అరచేత పెట్టుకొని ఆర్తనాదాలు చేశారు. అధికారులు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రాంతాలకు తరలించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Floods
- Munneru River
- Rains
- swimmers
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

