కొత్త జిల్లాలు.. ప్రగతి పునాదులు.. వికేంద్రీకరణతో అభివృద్ధి పరుగులు
ప్రజలకు చేరువైన ప్రభుత్వ సేవలు.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. 10 నుంచి 33 జిల్లాలుగా ఏర్పాటు
- స్థానిక సంస్థల బలోపేతం.. విద్య, పారిశ్రామిక, ఆర్థికరంగం హైప్
- పెరిగిన రాజకీయ, సామాజిక చైతన్యం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సాధికారతకు ఆస్కారం
హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు దార్శనికతతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో రాష్ట్ర ప్రగతి వేగవంతంగా పరుగులు పెట్టింది. భారీ మౌలిక వసతుల కోసం చేపట్టిన ప్రాజెక్టులు నిర్ణీతకాలంలో పూర్తయ్యాయి. ప్రజలకు పరిపాలన చేరువైంది. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యాయి. పాలన వికేంద్రీకరణ వల్లే తెలంగాణ ఈ అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడంలో అతిశయోక్తి లేదు. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం తెలంగాణలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడం తదితర లక్ష్యాలతో 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 జిల్లాల వ్యవస్థను విస్తరించి 31 జిల్లాలుగా ఏర్పాటుచేశారు. అనంతరం మరో రెండింటితో మొత్తంగా 33 జిల్లాలుగా ఏర్పాటుచేశారు.
ఈ జిల్లాల ఏర్పాటుతో ప్రధానంగా జిల్లా కేంద్రాలకు ప్రజలు ప్రయాణించే దూరాన్ని తగ్గించారు. రెవెన్యూ, సంక్షేమం, విద్య, వైద్యం వంటి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిపాలనను మెరుగుపరిచారు. వెనుకబడిన ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. అధికారులు, సిబ్బంది పనిభారాన్ని తగ్గించి ఫిర్యాదుల పరిషారాన్ని వేగవంతం చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల పనితీరు సైతం ఎంతో మెరుగుపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో దోహదం చేసింది. రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసింది. ప్రతి పల్లెల్లో భూమి బంగారమైంది. సుస్థిరమైన, సమర్థవంతమైన పాలన వల్లే అది సాధ్యమైంది.
సకాలంలో ప్రాజెక్టుల పనులు పూర్తి
ప్రత్యేక రాష్ర్టావిర్భావం అనంతరం తొలి సీఎంగా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారంచుట్టింది. గురుకులాలను విస్తరించింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు, భక్తరామదాసు, సమ్మక్కసాగర్ తదితర అనేక భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. వైద్యశాలలు నిర్మించింది. విద్యుత్తు రంగాన్ని పూర్తిగా సంస్కరించింది. మౌలిక వసతుల కల్పనకే దాదాపు రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. దాదాపు అన్ని ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా నాడు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసింది. మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తిచేయాలంటే భూసేకరణను నిర్వహించాల్సి ఉంటుంది. అంతేస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను అక్కడికక్కడే పరిష్కరించుకునే సౌలభ్యం అత్యంత అవసరం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ వెసులుబాటు కలిగింది. ఒకే జిల్లా అధికారి పరిధిలోనే కాకుండా ఒక్కో ప్రాజెక్టుపై అనేక మంది ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణకు మార్గం ఏర్పడింది. ఫలితంగానే తెలంగాణ ప్రగతి పరుగులు తీసింది.
చారిత్రక మలుపులు
చిన్నరాష్ట్రంగా ఏర్పడి అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరిన తెలంగాణ ప్రస్థానంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో నవశకానికి నాంది పలికినైట్టెంది. తెలంగాణలో నైజాంకాలంలో ఏర్పాటుచేసిన జిల్లాలకు ఈ ఆరు దశాబ్దాల కాలంలో జత కలిసినవి కేవలం రెండు జిల్లాలే కావడం గమనార్హం. 1953లో వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం, 1978లో హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర పరిధిలోని అంశమైనా ఆ దిశగా సమైక్య పాలకులు నాడు అడుగులే వేయలేదు.
దేశంలో ఒకేసారి 10 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఒడిశా ప్రభుత్వం రికార్డు సృష్టించగా, ఒకేసారి 23 కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి కేసీఆర్ ప్రభుత్వం ఆ రికార్డును చెరిపేసి చరిత్ర పుటలకు ఎక్కింది. 2,000 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మరో కొత్త చరిత్ర ప్రారంభమైనట్టు అయింది. చిన్న జిల్లాలతో అనేక సామాజిక వర్గాల నుంచి కులాల నుంచి రాజకీయ, సామాజిక నాయకత్వం అభివృద్ధి జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళల సాధికారితకు చిన్న జిల్లాలు రాచబాట వేశాయి. ప్రజల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, విద్య, ఆర్థిక, పారిశ్రామికీకరణ ఊపందుకున్నాయి.
జాతీయస్థాయిలో అవార్డులే నిదర్శనాలు
గడచిన పదేండ్లలో తెలంగాణకు జాతీయస్థాయిలో అనేక అవార్డులు దక్కాయి.రాష్ట్రంలో 28 వేల చెరువులను బాగుచేసుకున్నది. 2,600 రైతు వేదికలు నిర్మించింది. 16 వేల నర్సరీలు ఏర్పాటుచేసింది. జాతీయస్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో దాదాపు 30 శాతం తెలంగాణ పల్లెలకే దక్కాయి. దేశంలోనే ఉత్తమ జిల్లా పరిషత్గా ములుగు అవార్డు దక్కించుకున్నది. స్కోచ్ అవార్డులను కైవసం చేసుకున్నది. ఇతర రాష్ర్టాల అధికార బృందాలు నాడు తెలంగాణకు విచ్చేసి ఇక్కడి పనులపై అధ్యయనం సాగించడం విశేషం. 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చుచేసింది. అందుకు కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిగిన పాలనా పరమైన సౌలభ్యమే అందుకు కారణం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పథకాలు, ప్రగతి పనులను వేగవంతంగా అమలు చేసేందుకు, నిరంతర పర్యవేక్షణకు అధికారులకు అవకాశం ఏర్పడింది. తద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించింది. అవార్డులు దక్కడమే అందుకు నిదర్శనాలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

