Robbery | ఠాణా పక్కనే నగల షాపులో చోరీ.. బురఖాలో వచ్చి షాపు యాజమాని ఛాతిపైన కత్తితో పొడిచి
మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగా దొంగలు పరారయ్యారు.
- పట్టపగలే బురఖాలో నగల దుకాణంలోకి
- షాపు యాజమాని ఛాతిపైన కత్తితో దాడి
- ఓనర్ సమయస్ఫూర్తితో దొంగల పరారీ
- మేడ్చల్లో బరితెగించిన దుండగులు
Robbery | మేడ్చల్, జూన్ 20: మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగా దొంగలు పరారయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో పోలీస్స్టేషన్ గేట్కు రెండు మూడు దుకాణాల ఆవల జగదాంబ జ్యువెల్లరి దుకాణం ఉన్నది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఇద్దరు బైక్పై వచ్చారు. ఎత్తుగా ఉన్న వ్యక్తి బురఖా వేసుకోగా, మరోవ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఆ ఇద్దరు నేరుగా నగల దుకాణంలోకి దూరారు. బురఖా వేసుకున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ యజమాని శేషారాంను బంగారం, వెండి నగలు ఇవ్వాలని హెచ్చరించాడు. యజమాని హతాశుడై చూస్తుండగానే కుడివైపు ఛాతిపై పొడిచాడు. ఒక్కసారి భయాందోళనకు గురైన షాపులోనే ఉన్న ఆయన కొడుకు సురేశ్ లోపలికి వెళ్లాడు. దొంగలు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో నగలు వేయాలంటూ బెదిరిస్తుంటే.. మీరే తీసుకోండి అంటూ శేషారాం చేతులెత్తేశాడు. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కౌంటర్ లోపల ప్రదర్శనకు ఉంచిన నగలను బ్యాగులో వేసే ప్రయత్నం చేస్తుండగా, శేషారాం వారిని తప్పించుకొని బయటికొచ్చి చోర్ చోర్ అంటూ అరిచాడు. అతడిని అనుసరించిన దొంగలు భయపడి బైక్ స్టార్ట్ చేసుకొని పారిపోయారు. ఇదే సమయంలో శేషారాం కుమారుడు సురేశ్ కుర్చీని బైక్ వెనుకాల కూర్చున్న వ్యక్తిపై విసిరాడు. కుర్చీ అతడికి తగిలినా కింద పడకపోవడంతో పారిపోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన శేషారాంను దవాఖానకు తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నది.
సంచలనమైన ఘటన
పట్టపగలే నగల దుకాణాదారుడిపై కత్తితో దాడిచేసి, దొంగతనానికి యత్నించిన ఘటన సంచలనంగా మారింది. దాడి సీసీ ఫుటేజీ బయటికి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ అయింది. ఘటన జరిగిన కొద్ది సమయంలోనే పట్టణ వ్యాప్తంగా ఉన్న నగలు వ్యాపారాలు, పట్టణ ప్రజలు జగదాంబా జ్యూవెల్లరీ దుకాణం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. ఘటనా స్థలాన్ని డీసీపీ నితిక పంత్, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, సీఐ సత్యనారాయణ సందర్శించారు. దొంగలు హిందీ మాట్లాడిన కారణంగా ఉత్తర భారతదేశానికి చెందినవారిగా భావిస్తున్నట్టు తెలిపారు. దొంగల దాడిలో గాయపడినప్పటికీ దుకాణ యజమాని చూపిన తెగువను మెచ్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

