పవర్ హాలిడే!.. కరెంట్ లేదు.. ఇవ్వలేం!..
చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. కొందామన్నా దొరుకుత లేదు: ముఖ్యమంత్రి ప్రకటన.. ఎంత ఖర్చు పెట్టినా కరెంట్ దొరికేటట్టు లేదు.. విద్యుత్తు కొరత తీవ్రరూపం దాలుస్తున్నది.. ఈ పరిస్థితుల్లో అవసరమైన కరెంట్ ఇవ్వలేం.. ఉన్నదాన్నే మనం పొదుపుగా వాడుకోవాలి
- కరెంట్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి
- ఈసారి రాష్ట్రంలో సాగు, తాగునీరూ కష్టమే
- వచ్చే 8 నెలలు తీవ్ర సంక్షోభం తప్పదు
- దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి
- చుక్కనీరు కూడా వృథా కానివ్వొద్దు: సీఎం
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘మున్ముందు విద్యుత్తు సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్తు కొనుగోలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ, మార్కెట్లో విద్యుత్తు అందుబాటులో లేదు. ఉన్న విద్యుత్తునే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యుత్తు ఆధారిత పనులను సాధ్యమైనంత వరకూ వాయిదా వేసుకోవడమే మేలు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్తు సంక్షోభంపై చేతులెత్తేశారు. పరోక్షంగా రాష్ట్రంలో పవర్ హాలిడేను ప్రకటించారు. భవిష్యత్తులో విద్యుత్తు కోతలు తప్పవని సంకేతాలిచ్చారు. ఎల్ నినో, విద్యుత్తు కొరత, సాగు, తాగునీటి సంక్షోభంపై శనివారం సీఎం ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
భవిష్యత్తు సంక్షోభంపై చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా సాగు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని స్పష్టంచేశారు. ఎల్ నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదురోవాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైన అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యుత్తు పనులు వాయిదా వేయండి
రాబోయే రోజుల్లో విద్యుత్తు సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని సీఎం తెలిపారు. రాష్ర్టానికి అవసరమైన విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నదని, కానీ.. మారెట్లో విద్యుత్తు అందుబాటులో లేదని తేల్చిచెప్పారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు. విద్యుత్తు ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాతాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. తద్వారా అనధికారికంగా పవర్ హాలిడే ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాను నియంత్రించాలని ఆదేశించినట్టు తెలిసింది.
సాగు, తాగునీటికీ గడ్డుకాలమే..
విద్యుత్తు సంక్షోభం మాత్రమే కాదని, సాగు, తాగునీటి సంక్షోభాన్ని కూడా రాష్ట్రం ఎదుర్కోబోతున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే జలాశయాల్లో నీళ్లు అడుగంటిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో సాగునీరు సంగతి పక్కనపెడితే తాగు నీళ్లకు కూడా కష్టమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రరూపం దాల్చకముందే అవసరమైన చర్యలు చేపట్టాలని, చుకనీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటల పరిస్థితులను అంచనా వేసి పంట చేతికొచ్చే వరకు నీటికొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ముందు తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
ప్రజలపైనే భారం వేద్దాం
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా విద్యుత్తు, సాగు, తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తాను చేసిన తప్పిదాలను పక్కనబెట్టి.. ప్రకృతిపై నెపం నెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ భారాన్ని, బాధ్యతను ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతున్నది. రాబోయే 8 నెలలు ఎల్ నినో సంక్షోభాన్ని ఎదురోవడంలో ప్రజలే కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. దసరా తర్వాత గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సమీక్షలకు తీరికే లేని సీఎం రేవంత్
కరువురాని, కష్టాలురాని, రైతులేమైనా గానీ, రాష్ట్రం ఎటైనా పోనీ.. కానీ, తనకు మాత్రం రాజకీయాలే ప్రథమ ప్రాధాన్యమని రేవంత్‌రెడ్డి తీరు కనిపిస్తున్నది. ఓవైపు కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. కనీసం దీనిపై మంత్రులతో సమావేశం నిర్వహించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం గమనార్హం. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు ఆగమేఘాలపై వెళ్తున్న సీఎంకు ఇక్కడి ప్రజలు పడుతున్న కష్టాలపై కనీసం రెండు గంటల సమయం కేటాయించి సమీక్షించే తీరికే లేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కరువుపై సమీక్షలు నిర్వహించి కరువు సాయం కోరుతూ కేంద్రానికి లేఖలు రాశారు.
మహారాష్ట్ర రూ.17,500 కోట్లు, కర్ణాటక రూ.3,705 కోట్ల పరిహారంఇవ్వాలని డిమాండ్ చేశా యి. కానీ ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి మాత్రం సమీక్ష నిర్వహించింది లేదు, కేంద్రానికి కరువు సాయంపై నివేదిక ఇచ్చిందీ లేదు. ఈనెల 12న మంత్రులతో సమీక్ష నిర్వహిస్తానని ఇప్పటికే ప్రకటించారు. కానీ అదేరోజు ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో కరువుపై సమీక్ష కన్నా ఢిల్లీలో ధర్నాయే ముఖ్యమనుకున్న సీఎం సమీక్షను వాయిదా వేశారు. తొలుత 12న మంత్రులతో సమీక్ష అంటూ ప్రకటించిన సీఎంవో.. ఆ తర్వాత త్వరలో మంత్రులతో సమీక్ష అంటూ మాటమార్చడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

