హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలనా వ్యవస్థ పడకేసిం ది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అధికారులు విధులకు సకాలంలో రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ వ్యక్తులు, దళారుల దే రాజ్యం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ విషయాలన్నీ స్వయంగా విజిలెన్స్ అం డ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (క్యూర్) ప్రాంతానికి ఐదు ప్రాం తీయ నిఘా విభాగాల నుంచి ప్రత్యేక విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను డీజీ శిఖాగోయెల్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ ట్రాస్క్ఫోర్స్ సిబ్బంది 10 బృందాలుగా విడిపోయి.. పలు ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 8 వరకు 20 కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయని తెలిసింది.
విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో అన్ని ఆఫీసుల్లో ప్రైవేట్ వ్యక్తులు, దళారులు మధ్యవర్తులుగా ఉంటూ అక్రమంగా పత్రాల తయారీ, అధికారిక పత్రాల నిర్వహణ, ప్రభుత్వ సిబ్బందితో నిర్వర్తిస్తున్నార ని గుర్తించారు. 20 ఆఫీసుల్లో 500 మందికిపైగా సిబ్బంది హాజరును పరిశీలించగా, చాలామంది అధికారులు విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. ఉప్పల్ ఆర్టీవో పరిధిలో 16,137 వాహనాలకు సంబంధించి సుమారు రూ.180.65 కోట్ల రవాణా పన్ను పెండింగ్‌లో ఉన్నదని విజిలెన్స్ అధికారులు చెప్పారు. పటాన్చెరు విద్యుత్తు శాఖ పరిధిలో రూ.2.65 కోట్ల బకాయిలు ఉన్నాయని తేల్చారు. ఆర్టీఏ ఆఫీసుల్లో 5,000 కుపైగా ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు పంపిణీ చేయకుండా మూలన పడేసి ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. 500కుపైగా దరఖాస్తులు గడువు ముగిసి నా పరిషారానికి నోచుకోలేదని తేల్చారు. కొన్ని పరిశ్రమలు ట్రేడ్ లైసెన్స్ అనుమతులు లేకుండానే నడుస్తున్నాయని గుర్తించారు. విద్యుత్తుశాఖలో కరెంటు చోరీ, ట్యాంపరింగ్‌కు సంబంధించిన 4,685 ఎ న్ఫోర్స్మెంట్ కేసుల్లో సుమారు రూ.3.88 కోట్ల వసూళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తేల్చారు.