CM Camp Office | బేగంపేట్ మెట్రోభవన్‌లో సీఎం క్యాంపు ఆఫీస్!
సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయితే అనుకూలంగా ఉం టుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
- సెక్యూరిటీ, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం
CM Camp Office | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయితే అనుకూలంగా ఉం టుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతిభవన్‌ను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటంతో కొత్తగా సీఎం కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం సీఎం స్వయంగా ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని పరిశీలించి అక్కడే ఖాళీ స్థలంలో క్యాంపు కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో ఉద్యోగులు, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడినుంచి సచివాలయం వరకు ఉండే రోడ్డు అత్యంత ట్రాఫిక్ రద్దీతో ఉంటుంది. దీంతో క్యాంపు కార్యాలయానికి వచ్చిపోయే సందర్శకులతో ఎంసీఆర్హెచ్ఆర్డీ సందడిగా మారే అవకాశం ఉండటంతో మరోచోట క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మూడు రోజుల క్రితం సీఎం నానక్‌రామ్‌గూడలోని గ్రోత్ కారిడార్ భవనాన్ని సందర్శించి క్యాం పు కార్యాలయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భవనంలో సెక్యూరిటీ పరంగా సమస్యలు తలెత్తే అవకాశమున్నదని అధికారవర్గాలు తెలిపాయి. దీం తో చివరగా బేగంపేట్‌లోని మెట్రో భవన్‌ను క్యాంపు కార్యాలయంగా ఏర్పాటుచేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇది సచివాలయం, అసెంబ్లీకి దగ్గరగా ఉండటం వల్ల సీఎం రాకపోకలకు కూడా సౌకర్యంగా ఉంటుందని, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మినిష్టర్ రోడ్డు, నెక్లెస్రోడ్డులమీదుగా సచివాలయానికి తేలిగ్గా చేరుకోవచ్చని ఈ భవన్‌ను ఎంపికచేసినట్టు తెలిసింది. త్వరలోనే మెట్రో భవన్‌లోని కార్యాలయాలను ఖాళీ చేయించి అవసరమైన మార్పులు చేర్పులు చేయడం ద్వారా క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

