దళిత్ ఎంపవర్మెంట్ స్కీంతో మారనున్న దళితుల జీవితాలు
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు దళిత సాధికారత పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

వరంగల్ అర్బన్ : దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు దళిత సాధికారత పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం మాదన్నపేట, గూడూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల స్వావలoబనకు దళిత్ ఎంపవర్మెంట్ స్కీం దోహదం చేస్తుందన్నారు. ఈ పథకం కింద నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుచేసినా ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడం బాధాకరమన్నారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
మాదన్నపేట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్‌కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

