DME | చేరినచోటే పాతుకుపోయారు.. డీఎంఈలో దశాబ్దాలుగా బదిలీ ఎరుగని డాక్టర్లు!
హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
- ఒకే మెడికల్ కాలేజీలో తిష్టవేసిన బోధన సిబ్బంది
- దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారి జాబితా విడుదల
DME | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు. ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా డీఎంఈ పరిధిలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ జాబితాలో అనేక మంది ప్రొఫెసర్లు దశాబ్దాలుగా హైదరాబాద్‌కే పరిమితం అయినట్టు స్పష్టం అవుతున్నది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ దవాఖానల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా పదోన్నతు లు పొందినా అక్కడే పాతుకుపోయినవారు పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం.
దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని ఇత ర ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నిసార్లు బదిలీలు చేపట్టినా పైరవీలు చేయించుకొని అక్కడే ఉండిపోతున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు తమ భార్య/భర్త హైదరాబాద్‌లో పనిచేస్తున్నారని కారణాలు చెప్తున్నారని, మరికొందరు తాము స్పెషాలిటీ వైద్యులమని, ఇతర ప్రాంతాలకు పంపితే అకడ ఈ సేవలు అందించే వెసులుబాటు లేదనే సాకులుచూపుతున్నారని చెప్తున్నారు. సంఘాల పేర్లు చెప్పుకొని, కూర్చున్న సీట్లోనే దశాబ్దాలుగా కొనసాగుతున్నవారు ఎంతోమంది ఉన్నారని పేర్కొంటున్నారు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, వీరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయటం ఎవరి తరం కావటం లేదన్న అభిప్రాయం వైద్యవర్గాల్లో బలపడిపోయింది.
వారు హైదరాబాద్‌కే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న నిపుణులకు నగరానికి వచ్చి, అత్యాధునిక వసతు ల మధ్య చికిత్స అందించే అవకాశం లేకుండా పోతున్నదనే అభిప్రాయం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో నాలుగేండ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్నవారిలో 276 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిలో 40 శాతం చొప్పు న అంటే 198 మందిని బదిలీ చేయాల్సి ఉన్నది. గతంలో మెడికల్ కాలేజీల సంఖ్య తక్కువగా ఉన్నది కాబట్టి వాళ్లు ఇక్కడే తిష్టవేసినా పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ప్రభుత్వమైనా మార్చుతుందా? అని గ్రామీణ ప్రాంతాల్లోని డాక్టర్లు ఎదురుచూస్తున్నారు.
- ఉస్మానియా దవాఖానలో నెఫ్రాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కిరణ్మయి ఇస్మాయిల్ 32 ఏండ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె 1992లో ఉద్యోగంలో చేర గా, పక్క హాస్పిటల్‌కు కూడా మారలేదు.
- గాంధీ దవాఖానకు చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ నితిన్‌కుమార్ 1994లో ప్రభు త్వ ఉద్యోగంలో చేరగా, 30 ఏండ్లుగా అదే దవాఖానకు పరిమితమయ్యారు.
- నిలోఫర్ దవాఖానకు చెందిన అనస్థీషియా ప్రొఫెసర్ సాధనరాయ్ 26 ఏండ్లుగా అక్కడి నుంచి కదలలేదు.
- ఉస్మానియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వాసిఫ్ అలీ 1994లో ఉద్యోగంలో చేరగా, 30 ఏండ్లుగా అక్కడే కొనసాగుతున్నారు.
- గాంధీ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మురళీధర్ 25 ఏండ్లుగా అదే దవాఖానకు పరిమితమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

