Congress | మా కన్నా ప్రత్యర్థులే బలవంతులు.. అందుకే ఓడిపోయాం!
‘అధికారం ఉండగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు విఫలమైంది. మీరంతా ఎందుకు ఓడిపోయారు? అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కురియన్ కమిటీ ప్రశ్నించింది.
- మా తప్పేం లేదు..
- కురియన్ కమిటీకి ఓడిన ఎంపీ అభ్యర్థుల వివరణ
Congress | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘అధికారం ఉండగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు విఫలమైంది. మీరంతా ఎందుకు ఓడిపోయారు? అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కురియన్ కమిటీ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు అభ్యర్థులు ఇచ్చిన సమాధానం కమిటీ సభ్యులను విస్మయపరిచినట్టు తెలిసింది. ‘మా కన్నా, మన పార్టీ కన్నా ప్రత్యర్థ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులు కలిసిపోవడంతో వాళ్లను ఎదుర్కోలేకపోయాం’ అంటూ పలువురు సమాధానం చెప్పినట్టు సమాచారం. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి సహకారం అందలేదని, తమకు వ్యతిరేకంగా పని చేశారని, నిధుల కొరత ఏర్పడిందని అందుకే ఓడిపోయామని చెప్పినట్టు తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావంలేని బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుపొందడాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రంలో కనీసం 12 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ వైఫల్యంపై పోస్ట్‌మార్టం చేసేందుకు నియమించిన కురియన్ కమిటీ గురువారం గాంధీభవన్‌లో గెలిచిన, ఓడిన ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మినహా మిగిలిన 16 మంది హాజరయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశమై నివేదిక అందించనుంది.
ఆ రెండింటిపై ఆగ్రహం
జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంపై కురియన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గెలిచేందుకు అవకాశం ఉన్న ఆదిలాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో ఓడటంపై ప్రశ్నలు సంధించినట్టు చెప్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన, సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో ఓడిపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సొంత పార్టీ నేతలే ఓడించారు
సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే తమను ఓడించారని ఎంపీ అభ్యర్థులు కమిటీకి చెప్పినట్టు సమాచారం. ఆశించిన స్థాయిలో ఆర్థిక మద్దతు లభించలేదని, నిధుల కొరతతో ఓడామని మరికొందరు చెప్పినట్టు తెలిసింది.
మీరంతా మాట్లాడుకున్నారా?
కురియన్ కమిటీ ముందు హాజరైన ఓటమి పాలైన అభ్యర్థులు అందరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం పట్ల కురియన్ కమిటీ సభ్యులు ఒక్కింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఎవరి బడీ టెల్లింగ్ సేమ్ స్టోరీ’ పెదవి విరిచినట్టు సమాచారం. మమ్మల్ని కలువడానికి ముందు మీరంతా ఒకేరకంగా చెప్పాలని ఏమైనా మాట్లాడుకున్నారా? అనే అనుమానాన్ని కూడా కమిటీ సభ్యులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా అయితే ఫ్యాక్ట్స్ ఎలా బయటికోస్తాయని కూడా వారు ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి కృషి ఆమోఘం
‘సీఎం రేవంత్‌రెడ్డి మా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, దిశా నిర్దేశం చేశారు. ఇన్చార్జి మంత్రులు ప్రచారం ముగిసేవరకు చిత్తశుద్ధితో పని చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల బీజేపీ వేవ్, బీఆర్ఎస్ అభ్యర్థులు వారితో చేతులు కలుపడం వల్లనే విజయం సాధించలేకపోయాం’ అని కురియన్ కమిటీ ఎదుట హాజరైన అంతా ఒకే రకంగా చెప్పినట్టు తెలిసింది. నిజానిర్దారణ కమిటీ సభ్యులతో పాటు అక్కడ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఒకరి తర్వాత ఒకరు అక్కడే ఉండటం వల్ల కొన్ని వాస్తవాలు చెప్పలేకపోయినట్టు ఓడిపోయిన ఒక అభ్యర్థి వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

