హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ప్రాక్టికల్స్ ల్యాబ్ మ్యానువల్స్‌ను ఇంటర్‌బోర్డు సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు వెబ్సైట్లో వీటి వివరాలను పొందుపరిచింది.
ప్రాక్టికల్స్ సిలబస్, నమూనా ప్రశ్నపత్రం, నెలవారి షెడ్యూల్స్‌ను ఈ మ్యానువల్స్‌లో వెల్లడించింది. విద్యార్థులు ప్రాక్టికల్స్ రికార్డులను పరీక్ష సమయంలో సమర్పించాలని బోర్డు సూచించింది.