లెటర్ ఐడీ మార్చినట్టు చిహ్నం మార్చుతారా?
లెటర్ ఐడీ మార్చినట్టు అధికార చిహ్నాన్ని మార్చడం సరికాదని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి
కవాడిగూడ, మే 31: లెటర్ ఐడీ మార్చినట్టు అధికార చిహ్నాన్ని మార్చడం సరికాదని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
చార్మినార్‌ను తొలగించడమంటే ప్రతి హైదరాబాదీని అవమానించినట్టే, ప్రతిఒక్కరిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. శుక్రవారం కవాడిగూడలోని అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజముద్రలోని చిహ్నాలను ఇప్పుడు తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ మార్చాలన్న యోచన ఉంటే నెల ముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

