హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ఎస్సీఈఆర్టీలో డిప్యుటేషన్ల రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మొత్తం సర్వీస్‌లో ఎస్సీఈఆర్టీలో మూడేండ్ల డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్, ఆన్డ్యూటీలను కూడా రద్దుచేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తాజాగా ఉత్తర్వులిచ్చారు.
ఇప్పటికే డిప్యుటేషన్‌పై రెండేండ్లు, ఆన్‌డ్యూటీపై ఏడాదికి పైగా ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న వారిని ఆయా స్థానాల నుంచి పాత స్థానాలకు పంపాలని ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.