బాసరలో ఇంటి దొంగల చేతివాటం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
- లడ్డూ, పులిహోర విక్రయాల్లో గోల్మాల్
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు
- ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగుల సస్పెండ్
- నలుగురు తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు
- ఆలయ ఈవో విజయరామారావు వెల్లడి
బాసర, జూన్ 28: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. శుక్రవారం లడ్డూ, పులిహోర తయారీ స్టోర్ నుంచి నాలుగు బుట్టల పులిహోర ప్యాకెట్లను విక్రయ కేంద్రం వద్దకు ఆటోలో తీసుకొచ్చారు. గ్రామస్థులు అనుమానంతో ఆటోలో ఉన్న పులిహోర ప్యాకెట్లను పరిశీలించి రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. నాలుగు బుట్టల్లో మొత్తం 350 పులిహోర ప్యాకెట్లకు 690 ప్యాకెట్లు ఉన్నాయి. వెంటనే గ్రామస్థులు ఆలయ ఈవో విజయరామారావుకు సమాచారం అందించారు. ఈవో అక్కడికి చేరుకొని తనిఖీ చేయగా 340 ప్యాకెట్లు అదనంగా ఉన్నట్టు గుర్తించారు.
లడ్డూలు విక్రయించే కేంద్రం వద్ద టికెట్లు రీసైక్లింగ్ అవుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. వాటిని తనిఖీ చేసి చింపకుండా ఉన్న టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం.. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. నలుగురు తాత్కాలిక ఉద్యోగులను పూర్తిగా విధుల నుంచి తొలగించారు.
ఈ విషయమై ఈవో విజయరామారావును వివరణ కోరగా.. లడ్డూ, పులిహోర విక్రయాల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. పులిహోర స్టాక్ రిజిస్టర్ కంటే స్టోర్ నుంచి అదనంగా విక్రయ కేంద్రానికి వచ్చినట్టు, టికెట్లు రీసైక్లింగ్ అవుతున్నట్టు విచారణలో తేలిందని చెప్పారు. ఈ ఘటనలో సూపరింటెండెంట్ శివరాజ్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశామని, తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న రాజేశ్వర్, రవి, మోహన్‌రెడ్డి, సాయన్నను విధుల నుంచి పూర్తిగా తొలగించామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

