హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల నియామక పరీక్షలు శుక్రవారం సజావుగా ముగిశాయి. 19 విభాగాల్లో 247 పోస్టులకు ఈ నెల 4 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించారు.
మొత్తం 48,494 దరఖాస్తులు రాగా, 24,073 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో జరిగిన పరీక్షలు 15 జిల్లా కేంద్రాల్లో నిర్వహించారు.