డీఈఈసెట్ టాపర్లు వీరే..
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ నెల 21న ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు.
- తెలుగులో ఆనంద్.. ఇంగ్లిష్లో శివ నాగేశ్వర్
- ఫలితాలు విడుదల చేసిన అధికారులు
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ నెల 21న ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. తెలుగు మీడియంలో 82.37%, ఇంగ్లిష్ మీడియంలో 88.69%, ఉర్దూ మీడియంలో 42.31% చొప్పున విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
తెలుగు మీడియంలో 76 మార్కులు సాధించి బీ ఆనంద్ స్టేట్ టాపర్గా నిలిచారు. ఇంగ్లిష్ మీడియంలో 83 మార్కులతో జవ్వాజి శివ నాగేశ్వర్, ఉర్దూ మీడియంలో 66 మార్కులతో డానిష్ అహ్మద్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఫలితాల విడుదలతో సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. జూన్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లు జూన్ 6 నుంచి 8 వరకు ఎంచుకోవచ్చని తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

