Congress Govt | ఆరు గ్యారెంటీలకు నిధులెలా?.. ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి రెండు నెలల గడువే మిగిలింది. రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకుపైగా నిధులు అవసరమని అంచనా.
- రైతు రుణమాఫీకి మరో రెండు నెలలే గడువు
- రాష్ట్రంలో మొదలైన పూర్తి స్థాయి బడ్జెట్ కసరత్తు
- జూలై రెండు లేదా మూడో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్
Congress Govt | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి రెండు నెలల గడువే మిగిలింది. రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకుపైగా నిధులు అవసరమని అంచనా. ఈలోగా నిధుల సమీకరణ పెను సవాలుగా మారింది. రుణమాఫీతోపాటు ఇతర హామీల అమలుకు అవసరమైన నిధులను సమీకరించడానికి ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఈ నెల 18 నుంచి శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను జూలై రెండో వారం లేదా మూడో వారంలో ప్రవేశ పెట్టడం కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
బడ్జెట్ ప్రతిపాదనలపై షెడ్యూల్
- 18న అగ్రి, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చ
- 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్పీఆర్, పంచాయతీరాజ్, మహి ళా శిశు సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులు, అధికారులతో సమావేశం
- 22న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖపై చర్చ
- 26న ఇరిగేషన్, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖలపై సమావేశం
- 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖలపై చర్చ
- 28 నుంచి జూలై 1 వరకు సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

