హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ ‘బీ’ క్యాటగిరీ సీట్ల లొల్లి తారస్థాయికి చేరింది. సీట్ల ర్యాటిఫికేషన్(ఆమోదం) ప్రక్రియను చేపట్టనుండటంతో వివాదం ముదురుతున్నది. పలు కాలేజీలు అక్రమాలకు పాల్పడటం, నిబంధలు పాటించకపోవడంతో విద్యార్థి జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు. కొందరు విద్యార్థి జేఏసీ నేతలు సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఉల్లంఘించిన కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంవీఎస్సార్, సీబీఐటీ, సీవీఆర్, ఎంజీఐటీ, గోకరాజు రంగరాజు, కేఎంఐటీ వంటి కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ‘బీ’ క్యాటరీరి సీట్లను భర్తీ చేశాయని, సీట్ల ర్యాటిఫికేషన్‌ను నిలిపివేయాలంటూ విద్యార్థి జేఏసీ నేతలు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కోరారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని, మెరిట్‌ను అనుసరించడం లేదని చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కమిటీని వేసి విచారణ జరుపుతామని, అభ్యంతరాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.