Warangal Lands | వరంగల్లోనూ భూముల అమ్మకం.. కుడా ఆధ్వర్యంలో రెండు ఎకరాలు విక్రయం
Warangal Lands | కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్‌స్టాండ్‌కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భూమిని గుంప గుత్తగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లుచేసింది.
Warangal Lands | హనుమకొండ, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్‌స్టాండ్‌కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భూమిని గుంప గుత్తగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లుచేసింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా రెండు ఎకరాలను కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేసింది. ఈ ఒక్క భూమినే విక్రయిస్తే విమర్శలు వస్తాయనే కారణంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో చేసిన మరో మూడు వెంచర్లతోని ఖాళీ ప్లాట్లను వేలం వేస్తున్నారు.
వరంగల్ అజాంజాహి మిల్లు భూముల్లోని ఓసిటీ, ఉనికిచర్లలోని యూనిసిటీ, అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని ప్లాట్లను వేలంలో విక్రయించనున్నట్టు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. హనుమకొండ బస్‌స్టాండ్ సమీపంలోని విలువైన భూముల విక్రయాన్ని అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో వేలం ప్రక్రియను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న 8 కమర్షియల్ ప్లాట్లు, అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని 3 ప్లాట్లు, 25న ఓసిటీలోని 45 రెసిడెన్షియల్ ప్లాట్లు, 5 కమర్షియల్ ప్లాట్లు, 28న ఉనికిచర్లలోని యునిసిటీలో 40 రెసిడెన్షియల్ ప్లాట్లకు వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి ఏపీలో రెవెన్యూ నుంచి మున్సిపల్‌కు బదిలీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ నగరంలోని భూ ములు రెవెన్యూ శాఖ నుంచి మున్సిపల్ శాఖకు బదిలీ అయ్యాయి. వరంగల్ మున్సిపాలిటీ వీటిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బదలాయించింది. హనుమకొండ బస్‌స్టాండ్ సమీపంలోని 2.27 ఎకరాల్లో కాళోజీ కళా క్షేత్ర నిర్మాణం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధాన రోడ్డు లేకపోవడంతో ఈ భవన నిర్మాణాన్ని మరో స్థలానికి మార్చింది. అప్పటి నుంచి ఈ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం పరిరక్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విలువైన భూములను 8 కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

