ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది!.. మంత్రి జూపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ఏటా 70వేల కోట్ల అప్పు అదనంగా వచ్చి చేరుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు.
- ఏటా రూ.70వేల కోట్ల మేర అప్పు పెరుగుతున్నది
- రుణ ఊబిలోనే మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయ్ కూడా
నాగర్‌కర్నూల్, మే 17: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ఏటా 70వేల కోట్ల అప్పు అదనంగా వచ్చి చేరుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు. అకాల వర్షానికి నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించడానికి వచ్చిన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎకరానికి 50 నుంచి 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుండటంతోనే కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతు మెప్పు పొందేందుకు మద్దతు ధర ప్రకటిస్తుందే కానీ ధాన్యాన్ని కొనడం లేదని, కొనుగోలు అంతా రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దుతున్నదని ఆరోపించారు. ఐకేపీ ద్వారా మహిళా సంఘాలు కొనుగోలు చేస్తున్న ధాన్యానికి వెంటనే సదరు రైతుకు రసీదు ఇవ్వాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తన దృష్టికి వెంటనే ఆ సంఘాన్ని రద్దు చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

