హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా న్యాయ విశ్వవిద్యాలయాల్లోని ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)ను ఆఫ్లైన్లో ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగనున్నది.
పరీక్ష రాసే అభ్యర్థులు ఒంటిగంట కల్లా పరీక్షాకేం ద్రాలకు చేరుకోవాలని క్లాట్ అధికారులు సూచించారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తవచ్చని, కావున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్షాకేం ద్రాలకు చేరుకోవాలని సూచించారు.