హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : సినీ అవార్డుల్లో భాగంగా ‘చదువుకోవాలి’ సినిమాకు గద్దర్ సినీ అవార్డు లభించింది. విద్యపై తీసిన సందేశాత్మక చిత్రానికి రాష్ట్రప్రభుత్వం అవార్డు అందజేసింది.
ఈ సందర్భంగా సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు గంధం సురేశ్‌కుమార్ సోమవారం చిత్ర నిర్మాత, దర్శకుడు ఎం వెంకటేశ్వర్రావును సన్మానించారు.