రేపటి నుంచి పార్లమెంట్.. మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి.
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన సవరణల ఆమోదం కోసం కేంద్రం ఒత్తిడి చేస్తుండగా, నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడాన్ని ప్రతిపక్షం లేవనెత్తనుంది. 2026 జన గణన డాటా అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని విపక్ష పార్టీలు ఆప్, ఆర్జేడీ, డీఎంకేలు డిమాండ్ చేయవచ్చునని భావిస్తున్నారు.
అదే సమయంలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘కోటాలో కోటా’ డిమాండ్‌ను నెరవేర్చాలని సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ డిమాండ్ చేయవచ్చు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లు 2023లో పార్లమెంట్లో ఆమోదం పొందింది. అయితే చట్టం ప్రకారం 2027 జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు దానిని అమలు చేయరాదు. దీంతో దాని అమలు 2034కు వాయిదా పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

