Telangana | అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఈ ఏడాది డిసెంబర్‌తో రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఈ ఏడాది డిసెంబర్‌తో రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు అవగాహన సమావేశం నిర్వహించినట్లు సీఈవో వికాస్‌రాజ్ అన్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్ రూంల భద్రతపైనా ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతపై సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి? వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి? వీవీ ప్యాట్లున్నాయా? వాటి తాజా పరిస్థితి ఏమిటి? అన్న అంశాలపైనా ఇప్పటికే సమాచారం తెప్పించుకున్న ఈసీ అధికారులు సమావేశం అనంతరం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు రానున్నారు. ఇక్కడ పరిస్థితులను క్రోడీకరించుకున్న తర్వాత ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. వాతావరణ శాఖ నుంచి కూడా నివేదిక తీసుకుంటుంది. సాధారణంగా రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఏమిటి? నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులుంటాయి? పోలింగ్ నిర్వహణకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయా? అన్న విషయాలను బేరీజు వేసుకున్న తర్వాత తేదీలను ఖరారు చేస్తుంది. సమీక్షా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆర్కే గుప్తా, సంజయ్‌కుమార్, కార్యదర్శి అవినాష్ కుమార్, ముఖ్యకార్యదర్శి హర్దేష్కుమార్, డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్ సాహూ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ బి.నారాయణన్, డైరెక్టర్ జనరల్ (మీడియా) ఎన్ఆర్ బుటోలియా, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ(డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్) దీపాలీ మసిర్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

