TGSRTC | టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్టీసీలో 1000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం అక్టోబర్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల వయసు వారు.. శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు వారు అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్కు మూడేళ్ల వయోపరిమితి ఉంటోందని పేర్కొంది. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్సైట్ చూడాలని పోలీసు నియమాక మండలి సూచించింది.