కోదాడ, మే 27 : కోదాడలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఇటీవల సీతారాంపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఫొటోగ్రాఫర్ ఇమ్రాన్ కుటుంబానికి కోదాడ మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. ఇమ్రాన్ కుటుంబానికి తమ వంతుగా యూనియన్ సభ్యులు విరాళాలు సేకరించారు. మొత్తం రూ.60,500 జమ అయింది. ఈ నగదును బుధవారం యూనియన్ ప్రతినిధులు కోదాడలోని ఇమ్రాన్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వనపర్తి వర్మ, మరికంటి లక్ష్మణ్, పిల్లుట్ల వెంకట్, శ్రీరామ్, కలర్ ల్యాబ్ వాసు, స్వామి, శ్యామల సైదులు, ప్రభాకర్, అల్లా బక్షు, శంకర్, నరేష్, అహమ్మద్, ఆనంద్ పాల్గొన్నారు.