హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఏర్పాటు చేసి ఈహెచ్ఎస్ అమలు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఒక డీఏను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను సమావేశపర్చి మిగిలిన సమస్యలపై చర్చించి వాటిని కూడా పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు.