హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ ఐసెట్-2025 ఫలితాలను సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు.
64,938 మంది పరీక్షలు రాయగా, 58,985 (90.83శాతం) మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అర్హత సాధించారు. మహిళలు 90.95 శాతం, పురుషులు 90.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.