TG High Court :హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath)కు హై కోర్టులో చుక్కెదురైంది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనను దోషిగా తేల్చింది. బతుకమ్మ కుంట(Batukamma Kunta) భూమి వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే రంగనాధ్ కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని సోమవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ వివాదంలో ఉన్న భూమిని, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బతుకమ్మ కుంట నిర్మించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు.
వివాదంలో ఉన్న బతుకుమ్మ కుంట భూమి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు సోమవారం హైడ్రా కమిషనర్‌ను దోషిగా తేల్చింది. నాలుగు వారాల్లో సదరు భూమిలో చేపట్టిన అన్ని నిర్మాణాలను తొలగించాలని, పూర్తి నివేదికను అందజేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.
బ్రేకింగ్ న్యూస్
హైడ్రా కమిషనర్ రంగనాధ్‌ను కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేల్చిన తెలంగాణ హైకోర్టు
బతుకమ్మ కుంట భూమి వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం
వివాదంలో ఉన్న భూమిని, స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ,… https://t.co/4vErNvCcQQ pic.twitter.com/K0t2zQo1fs
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2026