Justice Madhavi Devi | హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిపై అనుచిత ఆరోపణలు.. చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు
Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కొడుకును కాపాడుకునేందుకు ఆమెను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. ఆ వార్తలు పూర్తిగా కల్పితమని.. అసత్య ప్రచారమని మండిపడింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్ II) బి.ఎస్. చిరంజీవి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్టు ఇస్తారని సోషల్‌మీడియాతో పాటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఫిర్యాదు లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు సోషల్‌మీడియా పోస్టులను ఆధారంగా చూపిస్తూ ఆయన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఐటీ యాక్ట్, బీఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మే 15వ తేదీన హైకోర్టు రిజిస్ట్రార్ రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ, న్యాయవర్గాల్లో సంచలనంగా మారింది.
ఇక.. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా ఈ దుష్ప్రచారంపై జస్టిస్ మాధవీదేవి విచారం వ్యక్తం చేశారు. కేసు విచారణను తాను కొనసాగించడంపై ఎవరికైనా చిన్నపాటి అభ్యంతరం ఉన్నా వెంటనే చెప్పాలని, విచారణ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశా రు.విచారణ ప్రారంభానికి ముందే న్యాయమూర్తి.. ఈ కేసులో వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశా రు.
బాధితురాలి తరఫు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు, పిటిషనర్ తర ఫు న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూ డా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ‘మీలో ఎంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు? అకడ జరుగుతున్న స్మియర్ క్యాంపెయిన్ (దుష్ప్రచారాన్ని) గమనించారా?అని జస్టిస్ మాధవీదేవి ప్రశ్నించారు. తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఉద్దేశాలను ఆపాదిస్తూ ప్రచారం జరగడం బా ధాకరమని వాపోయారు. ‘కొందరు నన్ను ప్రభావితం చేస్తున్నారంటూ తప్పు డు ప్రచారం చేస్తున్నారు. నాకు ఆశ చూ పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Tg High Court Letter
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

