భారీ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. సీఐడీ స్పెషల్ ఆపరేషన్‌లో 11 మంది అరెస్టు
ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ పోలీసులు ఉకుపాదం మోపారు. ‘డఫాబెట్' పేరుతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న భారీ నెట్వర్ను ఛేదించి, 11 మంది నిందితులను అరెస్టు చేశారు.
- రూ.3.21 లక్షలు, 3 కార్లు, 26 ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ పోలీసులు ఉకుపాదం మోపారు. ‘డఫాబెట్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న భారీ నెట్వర్ను ఛేదించి, 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 3 విలాసవంతమైన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, కియా సెల్టోస్ కార్లు, 8 ల్యాప్‌టాప్‌లు, 2 ఐప్యాడ్లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్‌పోర్టులు, రూ.3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐడీ డీజీ చారుసిన్హా సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
కరీంనగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ 2024-2025 జనవరి మధ్య బెట్టింగ్‌లలో రూ.9.95 లక్షలు కోల్పోయినట్టు పోలీసులకు చెప్పాడని, అతని ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై కేసు నమోదైందని చెప్పారు. నిందితులు 8 స్థాయిల్లో 46 మధ్యవర్తి బ్యాంకు ఖాతాల ద్వారా బెట్టింగ్ డబ్బును సేకరించి, ఇతర ఖాతాలకు మళ్లించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్‌పై ఇప్పటికే 414 కేసులు నమోదు చేశారని డీజీ చారుసిన్హా తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

