హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది. వివిధ దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలు సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ భారీ విజయం సాధించాలని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని కోరుతూ.. ఆదివారం యూఎస్ఏలోని డెలవేర్ రాష్ట్రంలో చార్లెస్ ఈ ప్రైస్ మెమోరియల్ పార్లో టెస్లా లైట్ షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా పిన్నా భాసర్ మాట్లాడుతూ.. పదేండ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు అద్భుతమని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, దీనికోసం ఎన్నారైలు తమవంతు సాయం చేస్తారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తామని చెప్పారు. టెస్లా షోకు సహకరించిన ఎన్నారై బీఆర్ఎస్ విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ తన్నీరు, డిజిటల్ మీడియా డైరెక్టర్ మహేశ్, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.