కరీంనగర్: తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరి పథకాలు లేవన్నారు. బీజేపీ నాయకులకు దమ్మంటే గొర్రెల పంపకం వంటి ఒక్క పథకాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని వారు ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల్లో రైతులు లేరా? గొల్లకుర్మలు లేరా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. చేతనైతే సద్విమర్శలు చేయాలని, వ్యక్తి గత దూషణలు సరికావని హితవు పలికారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం