కరోనాలోనూ ఆగని ఉపకారం
- బీసీ విద్యార్థులకు 458.38 కోట్లు
- 7.46 లక్షల మందికి ప్రయోజనం

హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఆన్లైన్లోనే తరగతులు కొనసాగుతున్నా విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్(ఉపకార వేతనాలు) చెల్లింపు ఆగకూడదన్న పట్టుదలతో సర్కార్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అండగా నిలుస్తున్నది. తాజాగా 2021- 22 విద్యాసంవత్సరానికి తొలి త్రైమాసికంలో చెల్లించాల్సిన రూ.333 కోట్ల 40 లక్షల 76 వేల ఉపకారవేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వివిధ పథకాల కింద ఈ విద్యాసంవత్సరానికి మొత్తం రూ.458.38 కోట్లు చెల్లించి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా విద్యార్థులపై పెడుతున్న ఖర్చును ఆపబోమని స్పష్టంచేసింది. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్స్, మహాత్మాజ్యోతిబా పూలే విద్యానిధి పథకం, నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి ఉపకార వేతనాలతోపాటు ఈబీసీ స్కాలర్‌షిప్‌లకు వివిధ పద్దుల ద్వారా ప్రభుత్వం విడుదలచేయటం విశేషం. ఒక్క బీసీ సంక్షేమశాఖ పరిధిలో నిర్వహించే విద్యా సంస్థలకే మెస్‌చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ కమ్ ట్యూషన్ ఫీజుతోపాటు మహాత్మాజ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం కింద అందించే ప్రోత్సాహకాలను నిర్విరామంగా కొనసాగిస్తుండటం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

