మిల్లింగ్ పరిశ్రమను కాపాడండి
రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ప్రభుత్వ విధానాలు, అధికారుల చర్యలతో మిల్లర్లు మరింత నష్టాల పాలవుతున్నారని తెలంగాణ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
- ప్రభుత్వం వేధింపులు ఆపకపోతే పరిశ్రమ కుప్పకూలుతుంది
- రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేత గణపతిరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ప్రభుత్వ విధానాలు, అధికారుల చర్యలతో మిల్లర్లు మరింత నష్టాల పాలవుతున్నారని తెలంగాణ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించుకున్న మిల్లర్లను నిందితులుగా చిత్రీకరిస్తూ సీఐడీ, విజిలెన్స్దాడులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని చెప్పారు.
ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టడం లేదని, ప్రభుత్వ విధానాలు, రొటేషన్ విధానంలో ఎదురైన నష్టాలతో ఇబ్బందులు పడుతున్న మిల్లర్లను కూడా అదే గాటన కట్టడం అన్యాయమని పేరొన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి మిల్లర్ల సమస్యలపై 13 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. మంత్రి అందులోని 5 డిమాండ్ల పరిషారానికి రాత పూర్వక హామీ ఇచ్చారని, ఆ వినతిని శాఖ కమిషనర్‌కు పంపి నెల దాటినా ఒక సమస్య కూడా పరిషారం కాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

