Minister Ponguleti | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి పొంగులేటి ఆదేశం
Minister Ponguleti | రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
Minister Ponguleti | రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. జిల్లాల్లోని అధికార యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నం కావాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా రెస్కూటీమ్‌లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఏ విధమైన సహాయం కోసమైనా ఏ సమయంలోనైనా రాష్ట్ర రాజధానిని సంప్రదించవచ్చన్నారు. ముఖ్యంగా గోదావరి ఉధృతిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

