జైళ్ల శాఖలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ల బదిలీ
తెలంగాణ జైళ్ల శాఖలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లకు స్థానచలనం కల్పిస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ (మాజీ) డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ నెల 11న ఉత్తర్వులు జారీచేశారు.
- ఖమ్మం జిల్లా జైలు, సబ్ జైళ్ల బాధ్యతలు రామయ్యకు.. హైదరాబాద్ సెంట్రల్ జైలుకు ఏ శ్రీధర్ బదిలీ
- 11న సౌమ్య మిశ్రా ఉత్తర్వులు
- 12న ఆమె ఉమెన్‌సేఫ్టీ వింగ్‌కు బదిలీ
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జైళ్ల శాఖలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లకు స్థానచలనం కల్పిస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ (మాజీ) డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ నెల 11న ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్ సెంట్రల్ జైలు లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ అటాచ్‌మెంట్‌పై ఖమ్మం జిల్లా జైలులో విధులు నిర్వహిస్తున్న ఏ శ్రీధర్‌ను హైదరాబాద్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ రామయ్యను వెంటనే రిలీవ్ చేసి, ఖమ్మం జిల్లా జైలులో రిపోర్టు చేయించాలని ఆమె ఆదేశించారు.
శ్రీధర్ నుంచి ఖమ్మం జిల్లా జైలు, జిల్లా సబ్‌జైళ్ల అధికారి బాధ్యతలను పూర్తిస్థాయిలో స్వీకరించాలని రామయ్యకు సూచించారు. ఈ ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజే (ఈ నెల 12న) సౌమ్య మిశ్రాను ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సౌమ్య మిశ్ర తన బదిలీకి ఒక రోజు ముందు ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లను బదిలీ చేయడం జైళ్లశాఖలో పెద్ద ఎత్తున తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

