స్పెషల్ ప్రివిలేజ్ ఫీజుపై స్టే రద్దు
రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బార్ల నుంచి స్పెషల్ ప్రివిలైజ్ ఫీజు వసూలు నిమిత్తం ఎక్సైజ్ శాఖ జారీచేసిన జీవో, సర్యులర్‌ను సవాలు చేస్తూ 114కుపైగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ జీవో అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. బార్లకు లైసెన్సుల జారీ సమయంలోనే ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం ప్రభుత్వం విధించే ఏ ఫీజును అయినా చెల్లిస్తామంటూ అంగీకరించిన బార్ల యజమానులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడం చట్టవిరుద్ధమని వివరించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతను సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని పేరొంటూ అప్పీలుపై విచారణను మూసివేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

