మాడల్‌స్కూల్ టీచర్ల జంగ్‌సైరన్
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని మాడల్‌స్కూల్ టీచర్లు ఉద్యమబాట పట్టారు. తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ జేఏసీ 12 రకాల డిమాండ్లను సర్కార్ ముందుంచింది.
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- బడుల్లో నల్లబ్యాడ్జీలతో నిరసనలు
- ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
- నవంబర్ 17న డైరెక్టరేట్ ముట్టడికి పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని మాడల్‌స్కూల్ టీచర్లు ఉద్యమబాట పట్టారు. తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ జేఏసీ 12 రకాల డిమాండ్లను సర్కార్ ముందుంచింది. సర్కార్ పట్టించుకోకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పోరుబాట పట్టారు. పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు.
సర్కార్ తీవ్ర వివక్ష
మాడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులే అయినా తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడమే లేదు. ఒకటో తేదీన వేతనం అందడమే లేదు. చనిపోతే కారుణ్య కోటాలో ఉద్యోగాలివ్వడమూ లేదు. సీపీఎస్ డెత్ గ్రాట్యుటీకి నోచు కోవడం లేదు. సీపీఎస్ మ్యాచింగ్‌గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. డీఏ బకాయిలు విడుదల చేయడం లేదు. ఈహెచ్ఎస్ సౌక ర్యం కల్పించనే లేదు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో దశలవారీ పోరాటానికి జేఏసీ పిలుపునిచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతోనే ఆందోళనలకు దిగినట్టు జేఏసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. టీచర్లంతా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు తరాల జగదీశ్, భూతం యాకమల్లు, అప్పాల అశోక్, కొండయ్య పిలుపునిచ్చారు.
ఉద్యమ కార్యాచరణ
- అక్టోబర్ 31న పాఠశాల స్థాయిలో అన్ని మాడల్స్కూళ్లలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
- నవంబర్ 2, 3 తేదీల్లో మండల స్థాయిలో నిరసనలు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలకు వినతిపత్రాల అందజేత
- నవంబర్ 4, 5, 6 తేదీల్లో జిల్లా స్థాయిలో నిరసనలు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు వినతిపత్రాల సమర్పణ
- నవంబర్ 10, 11, 12 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల అందజేత. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వినతిపత్రాలు
- నవంబర్ 17న విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి.. మహాధర్నా.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

